కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్పీ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కేంద్ర బొగ్గు గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లద్ జోషి కర్నూలు జిల్లా, ఓర్వకల్లు మండలంలోని పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టును సందర్శించేందుకు విచ్చేశారు.ఈ సందర్భంగా గురువారం కర్నూలు ఓర్వకల్లు ఎయిర్పోర్టులో కేంద్రమంత్రి ని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుఛ్ఛం అందజేశారు. భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరిశీలించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం నంద్యాల జిల్లా, అహోబిలం క్షేత్రానికి చేరుకొని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోనున్నారు.