బాధితుడు పొగోట్టుకున్న చీరల బ్యాగు అప్పగింత
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఆటోలో పోగొట్టుకున్న చీరల బ్యాగు ను వెతికించి బాధితుడికి కమాండ్ కంట్రోల్ పోలీసులు గురువారం అందించారు.తమిళనాడు , మధురై దగ్గర శంకర్కోయిల్ గ్రామం కు చెందిన చీరల వ్యాపారస్తుడు జగదీష్.కర్నూల్ మౌర్య ఇన్ దగ్గర ఆటో ఎక్కి చందన బ్రదర్స్ , డ్రెస్ సర్కిల్ దగ్గర ఆటో దిగాడు.ఆటోలో రూ. 12 వేల విలువ చేసే చీరల బ్యాగును ఆటోలో మర్చిపోయాడు.అతను కర్నూలు రెండవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇటీవలకొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ సిఐ శివశింకర్ ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్న ఏఎస్ఐ అస్లాం , హెడ్ కానిస్టేబుల్ రమేష్ రాయల్ సీసీ కెమెరాల ద్వారా సీసీ ఫుటేజ్ పరిశీలించారు. ఆటోని గుర్తించారు. ఆటో టాప్ నెంబర్ తెలుసుకొని ఆటో డ్రైవర్ రషీద్ ను పిలిపించి చీరల బ్యాగును బాధితుడికి అందజేశారు. ఈ సందర్భంగా తమిళనాడు చెందిన జగధీష్ పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశాడు.