త్రాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి
1 min read
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ అధికారులకు ఆదేశం
స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు హాలులో గురువారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాo
అధ్యక్షత వహించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీప్రసాద్
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు :ప్రస్తుత వేసవికి జిల్లాలో ఎక్కడ త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రతిష్టమైన చర్యలు తీసుకోవాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా జనరల్ బాడీ సమావేశం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, ఎమ్మెల్యేలు ఆరిమిల్లి రాధాకృష్ణ, చిర్రి బాలరాజు, జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ పి .ధాత్రిరెడ్డి, జెడ్పిటిసి లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, పలువురు జెడ్పిటిసీలు తమ ప్రాంతాలలోని కొన్ని గ్రామాలలో త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై చైర్ పర్సన్ స్పందిస్తూ జిల్లాలో కృష్ణా, గోదావరి కాలువలను కట్టివేసి తేదీని ఈనెల 22 వరకు పొడిగించినందున, ఈ లోగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని త్రాగునీటి నీటి వనరులను పూర్తి స్థాయిలో నింపుకోవాలని, కాల్వల ద్వారా శివారు ప్రాంతాలకు కూడా నీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ప్రస్తుత వేసవిలో ప్రజలకు త్రాగునీటి సరఫరాలో ఎటువంటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రాంతాలలో కొత్తగా బోర్లు ఏర్పాటుచేయాలని, మరమ్మత్తులకు గురైన బోర్లను వెంటనే మరమ్మత్తులు చేయించాలన్నారు. మండలంలో చేపట్టే అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాల వివరాలు జెపిటిసి లకు తెలియజేయాల్సిందే: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ
మండలంలో చేపట్టే ప్రభుత్వ అధికారిక అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను ప్రోటోకాల్ ప్రకారం సంబంధింత జెడ్పిటిసిలు, ఎంపిపి లు, ఇతర ప్రజా ప్రతినిధులకు తెలియజేయాలని, ప్రోటోకాల్ ఉల్లంఘించే అధికారులపై చర్యలు తీసుకుంటామని జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ హెచ్చరించారు. మండలంలో జరిగే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల సమాచారం, చేపట్టే పనులు వివరాలు సంబంధిత శాఖల అధికారులు తమకు తెలియజేయడం లేదని, ప్రారంభోత్సవ కార్యక్రమాలకు తమకు ఆహ్వానం అందించడం లేదని పలువురు జెడ్పిటిసి లు సభ దృష్టికి తీసుకురాగా జెడ్పి చైర్ పర్సన్ స్పందించారు. ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ జెడ్పిటిసిలు, ఎంపిటిసి లకు గత 18 నెలలుగా రావలసిన గౌరవవేతనం బకాయిలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పారిశ్రామికాభివృద్ధి లో భాగంగా జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా మంజూరైన యూనిట్లను లబ్ధిదారులతో వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తణుకు సమీపంలో పశువుల మాంసం కేంద్రం కారణంగా పర్యావరణానికి విఘాతం కలుగుతుందని ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు. తణుకుమన జిల్లా పరిషత్తు మూడు జిల్లాలకు సంబంధించినది,సంఖ్యా బలంగా అన్ని నియోజకవర్గాలకు సమానంగా నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. గతంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం కింద ప్రతి నియోజకవర్గానికి రూ 25 కోట్లు కేటాయించారని, కానీ తాడేపల్లిగూడెం కు రూ 7 కోట్లు మాత్రమే మంజూరు చేసారని,భవిష్యత్తులో వ్యత్యాసాలు లేకుండా నిధులు సమానంగా కేటాయించి అభివృద్ధికి సహరించాలని బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య, సాగునీటి కాలువలు, చెరువులు, డ్రైన్లలో తూడు తొలగింపు పనులు చేపట్టాలని కోరారు. పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు మాట్లాడుతూ పోలవరం ఏజెన్సీ ఏరియాలో ఏడు మండలాలు 121 గ్రామాలు ఉన్న ప్రాంతం గత ప్రభుత్వం నిధులు కేటాయించ అన్ని ప్రాంతాలు వెనుకబడి పోయాయని అన్నారు. కూటమి ప్రభుత్వం పది నెలలు పాలనలో సంక్షేమం,అభివృద్ధి వేగవంతంగా జరిగి ఏజెన్సీ ప్రాంతం ప్రజలు ఆనందంతో ఉన్నారని అన్నారు. ఓహెచ్ ఆర్ యస్ మంజూరు అయినా పనులు మొదలు కాక త్రాగునీటికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఓహెచ్ ఆర్ యస్ పనులు పూర్తిచేసి గిరిజన ప్రాంతాలలో త్రాగునీటి ఏడాదికి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి మరిన్ని నిధులు కేటాయించాలని కోరారు. లని బాలరాజు కోరారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ కె. భీమేశ్వరరావు, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల జాయింట్ కలెక్టర్లు టి. రాహుల్ కుమార్ రెడ్డి, ఎస్. చిన్న రాముడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.