వైభవంగా సంగీత యుక్త ఇష్టలింగ మహాపూజ
1 min read
కాళీ జగద్గురువు చేత సాగిన ప్రత్యేక పూజలు
హొళగుంద సిద్ధేశ్వరస్వామి ఆవరణంలో సంగీత యుక్త ఇష్టలింగ మహాపూజ నిర్వహిస్తున్న కాశి జగద్గురువు
కార్యక్రమానికి హాజరైన మహిళలు, భక్తులు
హొళగుంద న్యూస్ నేడు : హొళగుంద. మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం కాళీ జగద్గురువుల ఆధ్వర్యంలో సంగీత యుక్త ఇష్టలింగ మహాపూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాలను తిలకించెందుకు స్థానికులే కాకుండ చుట్టూ పక్కల గ్రామాలు. పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. స్తానిక సిద్ధేశ్వరస్వామి ఆలయ ఆవరణంలో జరుగుతున్న శ్రీకల్బుర్గి శరణ బసవేశ్వర పురాణ ప్రవచన కార్యక్రమం, బసవేశ్వర జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ సంగీత యుక్త ఇష్టలింగ మహాపూజలో భాగంగా కాళీ జగద్గురువుల అధ్యక్షతన సాగిన సంగీత కార్యక్రమాలు, భజనాలు, ఇతర కార్యక్రమాలతో పూజలు జరిగాయి. ఈ సందర్భంగా జగద్గురువును భక్తులు ఘనంగా సత్కరించారు. అనంతరం భక్తులనుద్దేశించి ఆయన మాట్లాడారు. కుళ్లు కుతంత్రలు వదిలి తమకు చేతనైనంత మేర పేదలకు దాన ధర్మాలు చేస్తే మనశ్శాంతి దొరుకుతుందని చెప్పారు. శాంతితో ప్రశాంత జీవనం గడువుకునేలా జీవితాన్ని తీర్చుకోవాలని ఆయన ఉపదేశం చేశారు. ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకుని మంచి మార్గాల్లో నడవాలని మానవ ధర్మాలను, వాటి విలువలను కాపాడుకుని నవ సమాజాన్ని నిర్మించుకోవాలని సూచిస్తూ అనేక అంశాల పై భక్తులకు బోధ చేశారు. ఈ కార్యక్రమానికి జంగమరు హౌస్టిళ్లికి చెందిన అజాత శంభులింగ శివాచార్య, పాల్తూరు చెన్నవీర శివాచార్య, కొట్టూరు శాకామశానికి చెందిన మరికొట్టూరు దేశీకేంద్ర మహాస్వాములు, నందీపుర డాక్టర్ మహేశ్వరా శివాచార్య మహాస్వాములు, రొదకుంద శివయోగి శివాచార్య మహాస్వాములతో పాటు పలువురు స్వాములు హాజరైయ్యారు.
