ప్రధాన మంత్రి పరిపాలనలో దేశం అగ్రగామిగా దూసుకు పోతుంది…
1 min read
కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల ప్రజలు పేదరికం నుండి బయటపడుతున్నారు
గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ లాంటి ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ల ద్వారా భారతదేశ మరింత అభివృద్ధి చెందుతుంది
కేంద్ర కన్జ్యూమర్స్ అఫైర్స్, ఫుడ్ &పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, న్యూ,& రెన్యువబుల్ ఎనర్జీ మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి
కర్నూలు, న్యూస్ నేడు: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల ప్రజలు పేదరికం నుండి బయటపడుతున్నారని కేంద్ర కన్జ్యూమర్స్ అఫైర్స్, ఫుడ్ &పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, న్యూ,& రెన్యువబుల్ ఎనర్జీ మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.శుక్రవారం గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ సైట్ ను పరిశీలించిన అనంతరం మంత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం అన్నారు..ప్రస్తుతం మనము అభివృద్ధి చెందడంలో ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్నామని త్వరలోనే 3వ స్థానానికి చేరుకుంటాము అన్నారు.. గత 10 సంవత్సరాల నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరిపాలనలో దేశం అగ్రగామిగా దూసుకొని పోతుందన్నారు.. దేశంలో 10 సంవత్సరాల క్రిందట 18 వేల 700 గ్రామాలకు కరెంటు తీగలు అనేవి ఉన్నాయని తెలియకుండా ఉన్నవారికి మన ప్రభుత్వంలో కరెంటు సౌకర్యాన్ని కల్పించడం జరిగిందన్నారు.. ప్రస్తుతం ప్రతి ఇంటిలో కరెంటుతో పని చేసే వస్తువులు ఉన్నాయన్నారు.. పిఎం సూర్యగర్ పథకం ద్వారా పేదలు తక్కువ ఛార్జ్ లకే విద్యుత్ వినియోగించుకుంటున్నారన్నారు.. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారని ఇది కేంద్ర ప్రభుత్వ పని చేసే విధానమని తెలిపారు… ఈ ప్రాజెక్టు వల్ల తను చాలా గర్వంగా మరియు సంతోషంగా ఉన్నాను అన్నారు.. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టు అని ఒకసారి వాడిన నీటితో విద్యుత్ ఉత్పత్తి చేయడం అదే నీటిని మళ్లీమళ్లీ వినియోగించుకుని విద్యుత్తు ని ఉత్పత్తి చేయడం అనేది చాలా మంచి విధానం అన్నారు. ఈ విధమైన ఆలోచనలు మరియు యూనిక్ ప్రాజెక్టు వల్ల దేశం మరింత అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. ఇటువంటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వము ఆహ్వానిస్తుందని మరియు వీటికి ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.. ఈ ప్రాజెక్టు 60 సంవత్సరాలు పైగా పనిచేసే సామర్థ్యం కలదని ఈ ప్రాజెక్టు అతి త్వరలో పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుందన్నారు.. కేవలం సోలార్ విద్యుత్ పైనే ఆధారపడి ఉండకూడదని ప్రత్యామ్నాయంగా గాలి విద్యుత్తు, నీటి విద్యుత్తు ను వినియోగించుకొని అభివృద్ధి చెందాలన్నారు..ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్‌లో 4,000 MW సౌర, 1,000 MW పవన మరియు 1,680 MW పంప్ చేయబడిన జలవిద్యుత్ ఉత్పత్తి ఉన్నాయని తెలిపారు.. గ్రీన్ కో కంపెనీ హైడ్రోజన్ పవర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్టులపై పనిచేస్తున్నారని దేశంలోని 20 రాష్ట్రాలలో వీరు వీటిని ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు..ఈ విధంగా దేశాభివృద్ధికి కృషి చేస్తున్న గ్రీన్ కో మేనేజింగ్ డైరెక్టర్ చలమల శెట్టి అనిల్ కుమార్ కు శుభాకాంక్షలు అభినందలు తెలియజేశారు.విలేకరుల సమావేశంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, చిక్బల్లాపూర్ ఎంపీ జి.సుధాకర్ రెడ్డి, గ్రీన్ కో మేనేజింగ్ డైరెక్టర్ చలమల శెట్టి అనిల్ కుమార్, కర్నూల్ ఆర్డీఓ సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.