వేడుకగా వైకుంఠం శివప్రసాద్ జన్మదిన సంబరాలు
1 min read
హొళగుంద న్యూస్ నేడు : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి, ఆలూరు మాజీ టిడిపి ఇంచార్జ్ శ్రీ వైకుంఠం శివప్రసాద్ జన్మదిన వేడుకలను హొళగుంద మండల తెలుగుదేశం నాయకులు శ్రీ చిన్నహ్యట శేషగిరి తెలుగుయువత రాష్ట్ర కార్యదర్శి, విష్ణువర్ధన్ రెడ్డి జిల్లా తెలుగుయువత కార్యనిర్వాహక కార్యదర్శి, గారిరువుల ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఆలూరు నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటుచేసిన వైకుంఠం శివప్రసాద్ పుట్టినరోజు వేడుకల్లో అనుచరగణంతో పాల్గొని ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు. తదనంతరం సాయంత్రం పులివెందులలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో వైకుంఠం శివప్రసాద్ పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు,కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన మాజీ తెలుగుయువత రాష్ట్ర కార్యదర్శి చిన్నహ్యట శేషగిరి తెలుగుదేశంపార్టీలో వైకుంఠం వారి కుటుంబం ప్రత్యేక విశ్వాసనీయతను కలిగి ఉందని మరియు ఎల్లప్పుడు కార్యకర్తలకు చేదోడు వాదోడుగా నిలిచి నియోజకవర్గపు సమిష్టి అభివృద్ధి కొరకు సాయుథుడై శ్రమిస్తున్న వైకుంఠం శివప్రసాద్ నాయకత్వంలో ఆలూరు అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామన్నారు. మరియు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంక్షేమమే పరమావధిగా ప్రజా పరిపాలన నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్య ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సువర్ణ పాలన దేశానికి ఆదర్శమని కొనియాడారు.కాగా ఏప్రిల్ 20 నాడు ఆలూరు నియోజకవర్గ కేంద్రంలో వైకుంఠం శివప్రసాద్ నాయకత్వంలో మనందరి అభిమాన ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుటకు తగిన ఏర్పాట్లు చేయబడుతున్నాయని కావున ఆలూరు నియోజకవర్గం లోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, వైకుంఠం అభిమానులు ప్రతి ఒక్కరు కూడా పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల కన్వీనర్ కోనేరు దుర్గయ్య, మాజీ వైస్ ఎంపీపీ ఎర్రి స్వామి, మిక్కిలినేని అయ్యప్ప, హెబ్బటం ఉపసర్పంచ్ సవారప్ప, యువనాయకులు ఖాదర్ బాష, సీనియర్ నాయకులు నబిరసూల్, వైకుంఠం యూత్ గిరి, టియన్ఎస్ఎఫ్ మల్లికార్జున, వలిబాష, చిదానంద, భాస్కర్, గోవిందు, గంగన్న, ఐ. టిడిపి నాగేంద్ర మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.