రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ డ్రైవర్ మృతి
1 min read
చెన్నూరు , న్యూస్ నేడు: ఈనెల 16వ తేదీన బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా నలుగురు గాయపడి ఆస్పత్రి చికిత్స పొందుతూ ఉండగా , ఆటో డ్రైవర్ పాలెం రాజుకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కొరకు తిరుపతి ఒక ప్రవేట్ హాస్పిటల్ లో చేర్పించడం జరిగింది. కాగా చికిత్స పొందుతున్న ఆటో డ్రైవర్ పాలెం రాజు శుక్రవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కాగా మృతుడు రాజుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజు మరణ వార్త తెలియగానే చెన్నూరు కొత్త గాంధీనగర్ లో విషాదఛాయలు అమ్ముకున్నాయి. రాజు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడు రాజు అందరితో కలిసి మెలిసి ఉండేవారని అలాంటి వ్యక్తి తమ లేకపోవడంతో అతని స్నేహితులు జీర్ణించుకోలేక బోరున విలపించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.