గోసేవ – గోవిందుడి సేవయే…
1 min read
డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే ..ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు
కర్నూలు, న్యూస్ నేడు: గోసేవ గోవిందుడిసేవ వేరుకాదని, ఒక్కటేనని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో తుగ్గలి మండలం, రామలింగాయ పల్లి గ్రామంలో వెలసిన శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు గత ఐదు రోజులుగా జరుగుతున్న ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత దేశం గో ఆధారితమైన దేశమని, గో సేవ వల్ల గోవిందుని సేవతో పాటు దేశ సేవ కూడా చేసినట్లు అవుతుందన్నారు. ఈ సందర్భంగా వారు గోమాత విశిష్టత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకటరాముడు, లక్ష్మీదేవి, ధర్మ ప్రచార మండలి సభ్యులు ఎ. వన్నూరప్ప, నాగేష్, రంగన్న, డీలర్ శ్రీనివాసులు, చెన్నంపల్లి, రామయ్య , బలరాముడు, పరశురాముడు, రామ లక్ష్మన్న, ఎన్.శ్రీనివాసులు, వి.హరి, శ్రీరాములు, భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.