సందీప్ బ్యాక్ టు సెట్స్
1 min readసినిమా డెస్క్: జనవరిలో సందీప్ కిషన్ మూవీ ఒకటి అనౌన్స్ చేశారు. వేదవ్యాస్ డైరెక్టర్. అయితే ఈ మూవీ షూటింగ్ మార్చ్ నెల్లో మొదలైంది. కొద్ది రోజుల షూట్ తర్వాత లాక్డౌన్ వల్ల బ్రేక్ పడింది. నిన్న మళ్లీ షూటింగ్ మొదలెట్టారు. ‘ఏ1 ఎక్స్ ప్రెస్’లో హాకీ ప్లేయర్‌గా కనిపించి మెప్పించాడు సందీప్. త్వరలో ‘గల్లీ రౌడీ’గా రావడానికి రెడీ అవుతున్నాడు. వర్క్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోందని ట్వీట్ చేశాడు సందీప్. ప్రియా ప్రకాష్ వారియర్, దిగంగనా సూర్యవంశీతో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు తనతో గతంలో ‘టైగర్’ చిత్రాన్ని తెరకెక్కించిన వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఇంకో సినిమా చేయడానికి కూడా రెడీ అవుతున్నాడట సందీప్. త్వరలోనే ఇది కూడా సెట్స్‌కి వెళ్లనుంది. కమెడియన్ సత్య లీడ్ రోల్ చేస్తున్న ‘వివాహ భోజనంబు’లో ఓ కీలక పాత్ర పోషించడంతో పాటు ఆ చిత్రాన్ని తానే స్వయంగా నిర్మిస్తున్నాడు కూడా. వీటితో పాటు మరో రెండు తమిళ మూవీలతోనూ బిజీగా ఉన్నాడు సందీప్ కిషన్.