ప్రభుత్వం మారిన అధికారులు నిర్లక్ష్యం వీడలేదు
1 min readబురదమయం రోగాలమయం.. గ్రామ ప్రజలకు శాపం..
నిర్లక్ష్యం నీడలో పంచాయతీ అధికారులు
పల్లెవెలుగు వెబ్ గడివేముల : గడివేముల మండల కేంద్రంలో వింత వాతావరణం నెలకొంది ఎన్నికల సమయంలో వచ్చిన అధికారులు పాలనను పట్టించుకోవడం లేదు ప్రజలకు సహకరించిన పాపాన పోలేదు. మండల కేంద్రంలోని గ్రామ సచివాలయంలో ప్రభుత్వం మారిన పాత ప్రభుత్వ తాలూకు మాజీ ముఖ్యమంత్రి జగన్ మహన్ రెడ్డి ఫోటోను అలాగే పెట్టడం నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. మండల కేంద్రంలో ఎన్నో సమస్యలు ఉన్న ప్రధాన పంచాయతీకి కార్యదర్శిగా మహిళల విధులు నిర్వహించడంలో విఫలమైందని కనీసం వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకొని గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నత్తనడకన సాగడం కొట్టొచ్చినట్టు కనపడుతుంది రోడ్లన్నీ బుడదమయంగా కాలనీలలో దోమలకు నిలయంగా మారిపోయాయి కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడం దోమలకు పాగింగ్ చేయడం ఎప్పుడో మర్చిపోయిన పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో మండల ప్రజలు విష జ్వరాలతో బాధపడుతున్నారు ఎప్పుడు సెలవుల్లో ఉండే పంచాయతీ కార్యదర్శి గ్రామంలో ప్రజల సమస్యలను తీర్చడానికి ఎలా పనికొస్తుందో జిల్లా స్థాయి అధికారులకే తెలియాలి ఇప్పటికైనా జిల్లా పంచాయతీ అధికారి స్పందించి మండల కేంద్రమైన గడివేములకు పనిచేసే పంచాయతీ కార్యదర్శిని వేయాలని గడివేముల గ్రామ ప్రజలు కోరుతున్నారు .