PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘మల్​బార్​’లో ఐదువేల ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యరంగంలో తనదైన ముద్ర వేసుకున్న మలబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్​ సంస్థ త్వరలో ఉద్యోగ నియమాకాలు చేపట్టనుంది. 260 షోరూములు, 10 దేశాలలో విస్తరించిన బలమైన గ్లోబల్​ రిటైల్​ నెట్​ వర్క్​ కలిగిన ప్రముఖ ఆభరణాల రిటైల్​ వ్యాపార సంస్థగా ఎదిగిన మల్​బార్​ గోల్డ్​ … కార్యకలాపాల నిర్వహణ కోసం ఐదు వేల పోస్టులు భర్తీ చేయనుంది. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ, కేరళ, తమిళనాడు, హైదరాబాద్​, బెంగుళూరు, చెన్నై తదితర ప్రాంతాల్లోని షోరూములలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు మల్​బార్​ జాబ్​ పోర్టల్​ www.malabarjobs.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అనుభవం, వయస్సు, ఇతర ముఖ్యమైన వివరాలు ఆన్​లైన్​లో ఉంచామని ఆ సంస్థ గ్రూప్​ చైర్మన్​ ఎం.పీ. అహ్మద్​ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

About Author