మండల వ్యాప్తంగా 97 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక రెండో నెల పెన్షన్ల పంపిణీ అధికారులందరూ కలిసి మొదటి రోజు దాదాపు మండలంలో 97% పింఛన్లు పంపిణీ పూర్తి చేశారు ఎంపీడీవో శివరాం రెడ్డి తెల్లవారుజామున 6 గంటల నుండి మండల వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పర్యవేక్షించారు గ్రామాలలో టిడిపి నాయకులు పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ద్వారా రెండు రోజులు పెన్షన్ల పంపిణీ చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను సమన్వయం చేసుకొని ప్రతి నెల ఒకటో తేదీ కల్లా పంపిణీ పూర్తి చేయాలని ఆదేశాల మేరకు ఒక్క రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ఈ సందర్భంగా తెలిపారు .