సాంస్కృతిక నృత్యాలు,భక్తిగీతాల పోటీలు పోష్టర్ ఆవిష్కరణ
1 min read

విజయవాడ, న్యూస్ నేడు: సర్వజీవులలో అంతరంగిక శక్తిగా శ్రీ దుర్గా మాత కొలువై ఉన్నదని, నేడు ఘంటసాల సంగీత కళాశాలలో సాంస్కృతిక నృత్యాలు,భక్తిగీతాల పోటీలు విశ్వజనని భక్తజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం సభ్యులు మేజర్ కౌతా సుబ్రహ్మణ్య శాస్త్రి వెల్లడించారు.విశ్వజనని భక్తజన సంఘం ఆధ్వర్యంలో శనివారం,గాంధీనగర్, ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మేజర్ కౌత సుబ్రహ్మణ్య శాస్త్రి మాట్లాడుతూ శ్రీ దుర్గా అమ్మవారిని ఆరాధించడం ద్వారా విశ్వం సుఖశాంతులతో వర్ధిల్లుతుందని స్పష్టం చేశారు. అమ్మవారి శక్తిని అందరూ గ్రహించి పూజించడం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు అన్నారు. విశ్వజనని భక్తి జన్మ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీ సాయంత్రం ఘంటసాల సంగీత కళాశాలలో క్లాసికల్ డాన్స్, భక్తి గీతాలాపనల పోటీలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పలువురు నగర ప్రముఖులు హాజరవుతారని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కార్యక్రమంయొక్క పోస్టర్ ను సంఘం సభ్యులు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్ బయ్యపు సుబ్బారావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


