లైన్ క్లియర్
1 min readసినిమా డెస్క్: ‘పుష్ప’ షూటింగ్‌లతో బిజీగా ఉన్న అల్లుఅర్జున్ నెక్ట్స్ మూవీ ఏమిటా అని ఫ్యాన్సంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తమిళ డైరెక్టర్ మురుగదాస్‌తో మూవీ ఉంటుందన్న వార్తొకటి చక్కర్లు కొడుతోంది. అఫీయల్ కన్ఫమేషన్ అయితే ఇంకా లేదు. కానీ ‘ఐకాన్’ మూవీ చేస్తాడని మాత్రం మేకర్స్ ఎప్పటి నుంచో ఊరిస్తున్నారు. రీసెంట్గా సుకుమార్ అర్జున్‌ని ఐకాన్ స్టార్ అని కూడా పిలిచాడు. ఇప్పుడీ మూవీకి లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ కెరీర్లో ఫస్ట్ టైమ్ అనుకున్న మూవీ ఇదే అసలు. దర్శకుడు వేణు శ్రీరామ్ తో ఈ సినిమాని నిర్మాత దిల్ రాజు ఎప్పుడో ప్లాన్ చేశారు. కానీ పరిస్థితులు కారణంగా చిత్రం వెనక్కి వెళుతూ వచ్చింది. ఈ గ్యాప్ లో వేణు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘వకీల్ సాబ్’ చిత్రం తీసి సాలిడ్ హిట్ కొట్టాడు.
బన్నీ కూడా సుకుమార్ తో ‘పుష్ప’ చిత్రాన్ని పాన్ ఇండియన్ లెవెల్లో అనౌన్స్ చేశాడు. ఈ మధ్యలో వేణు శ్రీరామ్‌కీ, నిర్మాత దిల్ రాజుకీ ఈ సినిమా విషయంలో చిన్న స్పర్థలు వచ్చాయని టాక్ నడిచింది. కానీ అలాంటివేమీ లేవట. ఇప్పుడు అవన్నీ సెట్ అయ్యిపోయాయట. ఆదీగాక అల్లు అర్జున్ కూడా సినిమాపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని తెలిసింది. అందుకే దిల్ రాజు వేణు శ్రీరామ్‌కి పూర్తి స్వేచ్చని ఇచ్చేశారట. అంతే ఇక వేణు శ్రీరామ్ క్యాస్టింగ్ సహా టెక్నీకల్ టీమ్‌ని ఫైనల్ చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పుష్ప పార్ట్ 1 కంప్లీట్ అయిన వెంటనే ఈ మూవీ పట్టాలెక్కించే ప్లాన్‌లో ఉన్నారట మేకర్స్.