PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కిర్రాక్​.. జోడీ..

1 min read

సినిమా డెస్క్​: లవర్‌‌ బాయ్‌ ఆది సుకుమార్‌‌ ట్రెండ్‌ మార్చి సీరియస్‌ సినిమాలు కూడా చేస్తున్నాడు. ఆది చేతిలో ఇప్పుడు ఐదారు ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ఐదేళ్ల క్రితం తనని ‘చుట్టాలబ్బాయి’గా చూపించిన వీరభద్రంతో ఇప్పుడు ‘కిరాతక’ మూవీ చేస్తున్నాడు. ఆదికి జోడీగా పాయల్‌ రాజ్‌పుత్‌ నటిస్తోంది. నిన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. హీరోహీరోయిన్ల రొమాంటిక్‌ లుక్‌తో పోస్టర్ ఆకట్టుకుంటోంది. అలాగే ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఆగస్టు 13నుంచి స్టార్ట్ అవనుందట. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో దాసరి అరుణ్ కుమార్, దేవ్ గిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. సురేష్ బొబ్బలి సంగీతం అందిస్తున్నాడు. విజన్ సినిమాస్‌ బ్యానర్‌‌పై డా.నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఇదే నిర్మాతతో మరో మూవీ చేస్తున్నాడు ఆది సాయికుమార్. ఈ సినిమాకి ‘నాటకం’ ఫేమ్ కళ్యాణ్ జీ గోగణ దర్శకుడు. ఇందులో సునీల్ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీకూడా సెట్స్‌కి వెళ్లనుంది.

About Author