NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వేలంపాటల్లో తగ్గిన ఆదాయం…

1 min read

నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు న్యూస్ నేడు: బండి ఆత్మకూరులోని లక్ష్మీ జనార్ధన స్వామి దేవాలయానికి సంబంధించి శుక్రవారం నిర్వహించిన భూముల వేలం పాటలు ఆదాయం గణనీయంగా పడిపోయింది. 17.30 ఎకరాలకు సంబంధించిన భూములను ఒక ఏడాది నిమిత్తం కౌలుకు వేలం వేయగా మూడు లక్షల 61 వేల రూపాయలకు వేలం దారులు పాట పాడారు. గత సంవత్సరం నాలుగు లక్షల 78 వేల రూపాయలకు వేలం పాడారు. దీనితో పోలిస్తే లక్ష 17వేల ఆదాయం తగ్గిపోయింది. ఈ భూముల వేలం కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారిగా గోపి నంద్యాల దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగప్రసాద్ సిబ్బంది నాగరాజు పోలీస్ సిబ్బందితోపాటు అర్చకులు గ్రామ పెద్దలు గ్రామ రైతులు వేలం పాటలో పాల్గొన్నారు.

About Author