NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కూటమి ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి…ఎం.పి

1 min read

న్యూస్ నేడు కర్నూలు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాలన్నీ అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు.. కర్నూలు మండలం రేమట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఊరవాకిలిని కే.డి.డి. సి బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు…అనంతరం  ఎం.పి నాగరాజు గ్రామంలో పర్యటించి గ్రామ సమస్యల పై ఆరా తీశారు…ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపి ప్రభుత్వం పంచాయితీ నిధులను దారి మల్లించి గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేసిందని మండిపడ్డారు…కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పంచాయతీ లకు ప్రత్యేక నిధులు విడుదల చేసి అభివృద్ధి చేస్తుందన్నారు.. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెద్ద వెంకన్న , గ్రామ టిడిపి నాయకులు ఊరవాకిలి వెంకటేశ్వర్లు , శేఖర్ , రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు .

About Author