NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిరుపేదలకు ఇంటి స్థలాలు మంజూరుకై ధర్నా

1 min read

న్యూస్ నేడు హొళగుంద : నిరుపేదలకు ఇంటి స్థలాలు మంజూరకై జూన్ 2వ తేదీన తాసిల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐ కాలనీలో వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది.శనివారం సిపిఐహోళగుంద మండల కార్యదర్శి మారప్ప మాట్లాడుతూ నిరుపేదలకు ఇండ్లు స్థలాలు ఇండ్లు నిర్మాణానికి నిధులు కేటాయించాలని జిల్లా సమితి పిలుపుమేరకు జూన్ రెండవ తేదీన మండల తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమా చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు టైలర్ సలాం, ఇబ్రహీం డ్రైవర్, సలాం భాష, మహిళా సంఘం నాయకులు జహిదమ్మ ,భూలక్ష్మి, వనజమ్మ,   కాజ మున్ని, వన్నూరు బి, బసమ్మ, కౌసర్ భాను , మెహరీన్ బీ , శేఖన్ బి, తదితరులు పాల్గొన్నారు.

About Author