NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉగ్రవాదనికి వ్యతిరేకంగా ఉద్యమిద్దాం …

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు:  దేశంలో పెట్రేగిపోతున్న ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశ దేశ ప్రజలు సమైక్యంగా ఉద్యమిద్దమని సిపిఐ సిపిఎం వైసీపీ పార్టీలు పిలుపునిచ్చాయి. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం దేవనకొండ మండల  కేంద్రంలో సిపిఎం సిపిఐ వైసీపీ పార్టీల ఆధ్వర్యంలో దేశ ప్రజల సమైక్యతా ర్యాలీ నిర్వహించారు.స్థానిక పాత తాసిల్దార్ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి బస్టాండ్ నందు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి నరసారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, వైసీపీ నాయకులు మదిలేటి శెట్టి, వీరశేఖర్ ,కిట్టు లు మాట్లాడుతూ, ఉగ్రవాదం మతోన్మాదం, యుద్దోన్మోధం లకు  వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని, ముస్కరుల నుండి దేశాన్ని కాపాడుకోవడానికి  ఐక్యంగా ఉన్నారని అయితే ఉగ్రవాదాన్ని ఒక మతానికి ఒక కులానికి అంటకట్టడం శోచనీయమని పేర్కొన్నారు. దేశంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని మతోన్మాదం, ఉగ్రవాదం, కులంని, మతంను చూడదని హింసయే వారి మార్గమని కావున సమస్త ప్రజానీకం వీరికి వ్యతిరేకంగా  ఐక్యంగా నిలబడాల్సిన అవసరం ఉందని అన్నారు.  ఈ సందర్భంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాతి ఐక్యతను భంగపరిచే మతోన్మాదాన్ని రెచ్చగొట్టే వారి ని రాజకీయాలకతీతంగా, మతాలకతీతంగా, కులాలకతీతంగా వ్యతిరేకిద్దామని ప్రజా ఐక్యతను కాపాడుకోవాల్సిన అవశ్యకత ఉందన్నారు. దేశంలో జరుగుతున్న మతోన్మాద దాడులను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు. మైనార్టీలపై దాడులను, వారి హక్కులను కాపాడడంలో ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో యూసుఫ్ బాషా,అశోక్, బజారి, రంగస్వామి, రంగన్న, మహేష్, నాగరాజు, కుమార్, రంగడు, చంద్రన్న, కొండన్న, తదితరులు పాల్గొన్నారు.

About Author