NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రౌడీ షీటర్లు నేర చరిత్ర ఇళ్లల్లో..పోలీసుల దాడులు

1 min read

నేర నియంత్రణకు సహకరించండి..రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం..

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్​ నేడు : నేర నియంత్రణకు పోలీసులకు ప్రజలు సహకరించాలని నందికొట్కూరు రూరల్ సీఐ టి సుబ్రహ్మణ్యం అన్నారు. అధికారుల ఆదేశాల మేరకురూరల్ సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని నాగలూటి గ్రామంలో మిడుతూరు,బ్రాహ్మణ కొట్కూరు ఎస్ఐ లు హెచ్ ఓబులేష్,తిరుపాలు మరియు క్యూఆర్టీ సిబ్బంది. బృందాలుగా ఏర్పడి సోమవారం తెల్లవారు జామున నేరనివారణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కార్డెన్ అండ్ సర్చ్ ను పోలీసులు గ్రామంలో నిర్వహించారు.ఈ సంధర్భంగా సీఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేరాలను నివారించడమే లక్ష్యంగా మరియు గ్రామాల్లో ఎలాంటి గొడవలు అల్లర్లు జరగకుండా నివారించుటకు పోలీసులు ప్రజల కొరకు ఉన్నారనే భరోసా కల్పించడం కొరకు ఈ కార్డెన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తామన్నామని సీఐ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సెర్చ్ ఆపరేషన్ లో పోలీస్ అధికారులు మరియు సిబ్బంది బృందాలుగా ఏర్పడి గ్రామంలోని అనుమానితులు, రౌడీ షీటర్లు,నేర చరిత్ర గల వారి ఇళ్లల్లో సోదాలు నిర్వహించి అక్రమ మద్యం 18 క్వార్టర్ బాటిళ్లను మరియు సరైన ధ్రువపత్రాలు లేని 16 మోటార్ సైకిళ్లను ఒక ఆటో స్వాధీనం చేస్తున్నట్లు సీఐ తెలిపారు.ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ ఏవరైనా చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని,పోలీసులు హెచ్చరించారు.కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిరంతరం కొనసాగిస్తూ ఉంటామని అన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *