NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఓటర్లను నమ్మించి మోసం చేసిన చంద్రబాబు

1 min read

పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి విమర్శ 

పత్తికొండ, న్యూస్​ నేడు:   ప్రజాస్వామ్య దేశంలో దేవుళ్ళుగా భావించే ఓటర్లను నమ్మించి మోసం చేసిన చంద్రబాబు నైజం అని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి విమర్శించారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను గుర్తు చేస్తూ,  ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోవడాన్ని నిరసిస్తూ, వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినాన్ని పాటించారు. మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ  ఆధ్వర్యంలో స్థానిక వైఎస్ఆర్సిపి కార్యాలయం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు వైసీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు వైఖరిని ఎండ కడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వైఎస్ఆర్సిపి శ్రేణులు కదం తొక్కారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అమలు చేసి ప్రజలకు మేలు చేయాలని అధికారులకు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా నాలుగు స్తంభాల మండపం వద్ద ప్రజలను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ  మాట్లాడారు. ప్రభుత్వం ఇలాగే మొండివైఖరి అవలంబిస్తూ ప్రజలను మోసం చేస్తే వారికి అండగా ఉండి పోరాటాలు చేస్తామని ఆమె హెచ్చరించారు. ఎక్కడ ఉచిత బస్సు, ఎక్కడ అమ్మఒడి ఎక్కడ రైతు భరోసా, ఎక్కడ విద్యార్థులకు ఫీజు రీయిమెంట్స్ , ఎక్కడ నిరుద్యోగ భృతి ఎన్నికల ముందు ఈ పథకాలను అధికారం లోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని,అమలు చేయకుంటే చొక్కా పట్టుకొని అడగండని నారా లోకేష్  యువ గళం పాదయాత్రలో చెప్పలేదా. మరి మీరు ఏమి అమలు చేశారో చెప్పాలని నిలదీశారు. ప్రజల తరఫున పోరాటం చేస్తామని కచ్చితంగా పథకాలు అమలు చేయాలని హెచ్చరించారు. వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలని అమలు చేయని పక్షంలో ప్రజల పోరాడు.

About Author