PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమీర్​ఖాన్​కు.. స్నేహితుడిగా చైతు..

1 min read

సినిమా డెస్క్​: మ్యాన్లీ హీరో నాగచైతన్య తన తండ్రి నాగార్జున బాటలోనే నడుస్తున్నాడు. బాలీవుడ్‌ పలు చిత్రాల్లో నటించారు నాగార్జున. ఇప్పుడు చైతు కూడా ‘లాల్‌ సింగ్‌ చద్ధా’ మూవీతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆమీర్‌‌ ఖాన్‌కి ఫ్రెండ్‌ గా నటిస్తున్నాడు. బాలా అనే సైనికుడిగా కనిపించబోతున్నాడు. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కరీనా కపూర్‌ హీరోయిన్. ‘ఫారెస్ట్ గంప్’ అనే హాలీవుడ్‌ చిత్రానికి రీమేక్‌. ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ అనంతరం ఇటీవల షూటింగ్‌ ప్రారంభమైంది. సెట్‌లో జాయినయిన చైతు తన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్ చేశాడు. ఆమీర్‌ ఖాన్, ప్రొడ్యూసర్ కిరణ్ రావ్‌, దర్శకుడితో పాటు చైతుని ఫోటోలో చూడొచ్చు.

About Author