NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మానవత్వం చాటుకున్న స్ఫూర్తి సేవకులు

1 min read

మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించిన స్ఫూర్తి సేవకులు

ప్యాపిలి, న్యూస్​ నేడు: డోన్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్  ప్రాంగణంలో శ్రీశైలంకి చెందిన వెంకటేష్ నాయక్ అనే అభాగ్యుడు  అనారోగ్యంతో చనిపోగా ఆర్టీసీ సిబ్బంది స్ఫూర్తి టీమ్ కి సమాచారం ఇవ్వగా స్ఫూర్తి టీమ్ సంఘటన జరిగిన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించగా అతడిది శ్రీశైలంకి చెందిన వెంకటేష్ నాయక్ గా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా  వారు వచ్చిన తర్వాత డోన్ పట్టణ పోలీస్ వారికి సమాచారం అందించి మృత దేహాన్ని వారికి అప్పగించడం జరిగింది. అనంతరం మృతదేహన్ని సొంత ఊరికి అంబులెన్సులో తరలించారు. స్ఫూర్తి సేవలను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి మధు, మోహన్ రెడ్డి, బొందిమడుగుల రాజు, అంబులెన్సు శేఖర్, వినయ్, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author