NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి గురువారం 12-06-2025 న కర్నూలు న్యాయ సేవా సదన్ నందు బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జడ్జి మాట్లడుతూ బాల కార్మిక వ్యవస్థ నిషేధ మరియు నియంత్రణ చట్టం 2016 ప్రకారం  బాల బాలికల తో  పని చేయించుకోవడం లేదా పనిలోకి అనుమతించడం పూర్తిగా నిషేధించడం అయినదని తెలిపారు. ఎవరైనా ఈ చట్టాన్ని ఉల్లంఘించి బాలలతో పని చేయించుకుంటే వారికి ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుందని  తెలిపారు. శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్  మాట్లాడుతూ బాల బాలికలతో షాపులందుగాని ఫ్యాక్టరీలందు గానీ పనిచేయించుకోవడం నేరమని తెలిపారు. ఎవరికైనా బాల కార్మికులు కనిపిస్తే 1098 కి గాని లేదా లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100 గాని కాల్ చేసి తెలుపవలసిందిగా ప్రజలను కోరారు.జడ్జి బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం పోస్టర్లను ఆవిష్కరించారు . అనంతరం జిల్లా న్యాయ సేవ సదన్ నుండి కొండారెడ్డి బురుజు వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కర్నూల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరినాధ్ చౌదరి,  అసిస్టెంట్ కమీషనర్ అఫ్ లేబర్ ఆఫీసర్ సాంబశివరావు, కర్నూలు చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద ,  చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ జుబేదాబేగం, బాల సంరక్షణ ఎన్జీవోస్ మౌనిక, జహంగీర్ చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.

About Author