NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యోగపై పాట రూపొందించిన వారికి నగదు బహుమతి

1 min read

జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

నంద్యాల, న్యూస్​ నేడు : యోగా సంగీత విభావరికి సంబంధించి తెలుగు, హిందీ, ఆంగ్లంలో పాటను రూపొందించిన వారికి లక్ష రూపాయలు నగదు బహుమతిని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి వెల్లడించారు. గురువారం యోగాంధ్ర కార్యక్రమంపై నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో యోగ నిర్వహణపై ఆసక్తి ఉన్న వ్యక్తులు పాటను రూపొందిస్తే ఉత్తమ పాట రచయితకు లక్ష రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం అందజేస్తుందని కలెక్టర్ తెలిపారు.యోగ క్రియలపై శ్రద్ధ,ఆసక్తి ఉన్న వ్యక్తులు తెలుగు, హిందీ, ఆంగ్లంలలో పాటను రూపొందించాలన్నారు. జిల్లాలో స్థాయిలో ఎంపికైన పాటలను రాష్ట్రానికి పంపడం జరుగుతోందన్నారు. అందులో మొదటి స్థానం సాధించిన వారికి లక్ష రూపాయల మేరకు నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సదవకాశాన్ని జిల్లాలో ఉన్న వారు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

About Author