NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దళిత రైతుకు న్యాయం చేయండి..

1 min read

రైతు  రిజిస్టర్ పట్టా భూమి వివరాలు ఆడంగల్ లో నమోదు చేయండి

ఎమ్మార్పీఎస్ ఆదోని డివిజన్ అధ్యక్షుడు పంచకుండగ వెంకటేష్ మాదిగ డిమాండ్

పి జి ఆర్ ఎస్ లో ఫిర్యాదు

న్యూస్ నేడు హొళగుంద : మండల పరిధిలోని వందవాగిలి గ్రామానికి చెందిన  రైతు హరిజన కాలింగ కు సంబంధించి పెద్ద గోనెహాలు గ్రామంలో ఉన్న రిజిస్టర్ పట్టాభూమి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని, రైతు పేరుపై అడంగల్ ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ డివిజన్ అధ్యక్షుడు పంచగుండుగా వెంకటేష్ మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పిజిఆర్ఎస్ లో దళిత రైతు హరిజన కాలింగ  భూ సమస్యపై తాసిల్దార్ కు ఫిర్యాదు చేసి రైతు యొక్క భూమినీ అక్రమంగా పేర్లపై ఆన్లైన్ రికార్డులను నమోదు చేయించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆన్లైన్ నందు వారి పేర్లను తొలగించాలని కోరారు. పెద్దకోనే హాల్ గ్రామంలో సర్వేనెంబర్ 8 పైకి 2.11 ఎకరాల భూమిని రైతు కాలింగ్ ఆ తండ్రి హరిజన లింగప్ప 1976 సంవత్సరంలో కొనుగోలు చేశారని అప్పటినుంచి భూమిలో వారే ఉన్నారని తెలియజేశారు. వారి యొక్క నిరక్షరాస్యతను రెవెన్యూ రికార్డులపై అవగాహన లేకపోవడాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు ఆర్థిక సమస్యలతో రైతు కుటుంబం వలస పోవడంతో అదే అదనగా అడంగల్ లో తమ పేర్లు నమోదు చేసుకుని ప్రస్తుతం రైతు కాలింగ్ అను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలియజేశారు. ఆన్లైన్ అడంగల్ తమ పేరుపై ఉన్నందున  భూమి కూడా తమదేనని వాదిస్తూ రైతు తన భూమిని సాగు చేసుకోవడానికి ఆటంకాలు కలిగిస్తున్నారని కాబట్టి మండల తాసిల్దార్ రైతు యొక్క భూమి సాగు అనుభవాన్ని, రైతు తండ్రి లింగప్ప కొనుగోలు చేసిన రికార్డులను దస్తావేజులను పరిశీలించి ఆన్లైన్ నందు పెద్దకోనే హాల్ గ్రామంలో సర్వేనెంబర్ 8 పైకి 2.11 ఎకరాల భూమిని దళిత రైతు హరిజన కాలింగ సన్నాఫ్ హరిజన లింగప్ప పేరు పై నమోదు చేయాలని  కోరారు. అగ్రవర్ణాల చేతిలో అన్యాయానికి గురైన రైతు కాలింగ తరపున ఎమ్మార్పీఎస్ పోరాటం చేస్తుందని రైతుకు న్యాయం జరిగే వరకూ ఎమ్మార్పీఎస్ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ ఆదోని డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ మాదిగ తెలియజేశారు.

About Author