NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హైదరాబాద్ లో ‘ ఎస్సీఎస్ టెక్ ఇండియా ’

1 min read

4,000 చ.అడుగుల సాఫ్ట్ వేర్ ఇంక్యుబేషన్ కేంద్రం

ఆర్ & డి ఆకాంక్షలను ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్న ఎస్సీఎస్ టెక్

ఏఐ, రక్షణ, సైబర్ సెక్యూరిటీ, ఫిన్‌టెక్, స్మార్ట్ సిటీలు మరియు మరిన్నింటిలో

స్టార్టప్‌లు, ఆవిష్కర్తలకు సాధికారత కల్పించడానికి కొత్త ఆర్ అండ్ డి హబ్

హైదరాబాద్, న్యూస్ నేడు : భారతదేశంలో తన పరిశోధన, అభివృద్ధి ఆవిష్కరణల గణనీయ విస్తరణను సూచించేలా నేడిక్కడ హైదరాబాద్‌లో తన అత్యాధునిక సాఫ్ట్‌వేర్ ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రారంభించినట్లు ఎస్సీఎస్ టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది. యూనిట్ నెం. 401, 4వ అంతస్తు, ప్లాట్ నెం. 24, అరుణోదయ కాలనీ, సైబర్ హిల్స్ రోడ్, మాదాపూర్‌లో 4,000 చ.అడుగుల విస్తీర్ణంలో 50 సీటింగ్ కెపాసిటీతో ఉన్న ఈ కేంద్రం తదుపరి తరం సాంకేతిక అభివృద్ధికి మద్దతు ఇవ్వడానికి, సాఫ్ట్‌వేర్ వ్యవస్థాపకులు, పరిశోధకుల అభివృద్ధి చెందుతున్న కమ్యూనిటీని పెంపొందించడానికి రూపొందించబడింది. ఈ సందర్భంగా ఎస్సీఎస్ టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ, ఎండీ శ్రీ సుజిత్ పటేల్ మాట్లాడుతూ హైదరాబాద్ కేంద్రం ప్రారంభం భారతదేశంలో డీప్-టెక్ ఆవిష్కరణలను అందరికీ అందుబాటు లోకి తీసుకు రావాలనే మా ఆశయాన్ని సాకారం చేసుకునే దిశగా ఒక నిర్ణయాత్మక అడుగు. సంవత్సరాలుగా ఎస్సీఎస్ టెక్ సేవ ఆధారిత సంస్థ నుండి ప్లాట్‌ఫామ్ ఆధారిత డిజిటల్ పరివర్తనకు దోహదపడే సంస్థగా పరిణామం చెందింది. కస్టమర్ అవగాహన, అధునాతన డిజిటల్ సామర్థ్యాల కోసం డిమాండ్ పెరిగేకొద్దీ, ఈ కేంద్రం తాజా ఆలోచనలను పెంపొందించడంలో, వాటిని వాస్తవ ప్రపంచ అనువర్తనాల్లోకి అనువదించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మౌలిక సదుపాయాలు, నైపుణ్యం, పెట్టుబడిని ఒకే పైకప్పు కిందకు తీసుకువచ్చే లాంచ్‌ ప్యాడ్‌ను అందించడానికి మేం గర్విస్తున్నాం’’ అని అన్నారు. ఈ కొత్త కేంద్రం రక్షణ, కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్ (ఏఐ / ఎంఎల్), బీఎఫ్ఎస్ఐ, స్మార్ట్ సిటీలు, భౌగో ళిక సమాచార వ్యవస్థలు (జీఐఎస్), సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్ వేర్ యాజ్  ఎ సర్వీస్,   బ్లాక్‌చెయిన్, ఫిన్‌ టెక్, హెల్త్‌టెక్, ఎడ్‌టెక్ వంటి కీలకమైన అభివృద్ధి చెందుతున్న రంగాలలోని వెంచర్‌లకు మద్దతు ఇవ్వడంపై దృష్టి పెడుతుంది.

About Author