గురుకులాల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తులు..
1 min read

నందికొట్కూరు, న్యూస్ నేడు: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో 6,7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జూపాడుబంగ్లా మరియు లక్ష్మాపురం ప్రిన్సిపాల్ లు తెలిపారు.నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల కేంద్రంలో ఉన్న బాలుర గురుకుల పాఠశాలలో ఆరవ తరగతిలో 8 సీట్లు,7వ తరగతిలో ఒకటి,8వ తరగతిలో ఒకటి,9వ తరగతిలో ఒక సీటు ఉన్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ పి సత్య నారాయణమూర్తి తెలిపారు. అర్హులైన విద్యార్థులు 23వ తేదీ రేపు సోమవారం లోపు విద్యార్థి ఆధార్,రేషన్ రెండు ఫోటోలు పాఠశాలలో అందజేయాలని వెంటనే ప్రవేశ పరీక్ష రాసేందుకు హాల్ టికెట్ ఇస్తామని ఈ ప్రవేశ పరీక్ష 25వ తేదీ చిన్న టేకూరు గురుకుల పాఠశాలలో ఉంటుందని అన్నారు.బాలురకు 6,7 తరగతులకు ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుందని మధ్యాహ్నం 2 గంటలకు 8,9 తరగతి విద్యార్థులకు ప్రవేశ పరీక్ష ఉంటుందని ప్రిన్సిపాల్ తెలిపారు.అదే విధంగా ప గిడ్యాల మండలం లక్ష్మాపురం బాలికల గురుకుల పాఠశాలలో 6,7,8,9 తరగతులకు మిగిలిన సీట్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వెంకట రమణమ్మ తెలిపారు.బాలికలకు దిన్నే దేవరపాడు గురుకుల బాలికల పాఠశాలలో 25వ తేదీ ఉ 10 గంటలకు 6,7 వ తరగతి విద్యార్థులకు,మధ్యాహ్నం రెండు గంటలకు 8,9 వ తరగతి విద్యార్థులకు ప్రవేశ పరీక్ష ఉంటుందని ప్రిన్సిపాల్ తెలిపారు.దరఖాస్తు చేసుకునే విద్యార్థులు రేపు సోమవారం లోగా పాఠశాలలో ఇవ్వాలని అన్నారు.ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వారు శనివారం తెలిపారు.

