NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మా నీటి వాటా మాకు ఇవ్వండి

1 min read

కర్ణాటక జలచౌర్యాన్ని  ఆపండి

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

ఈఈ పాండురంగయ్య సమక్షంలో  పిసి మరియు  డిసీల  సమావేశంలో మిక్కిలినేని వెంకట శివప్రసాద్

న్యూస్ నేడు హొళగుంద :  టీబీపీ ఎల్ ఎల్ సి ఈఈ పాండురంగయ్యకు ఘన సన్మానం తుంగభద్ర జలాశయయం నుండి వ్యవసాయానికి  విడుదల చేసే నీటి కోటాలో ఆంధ్ర రైతుల నీటి వాటాను పూర్తిగా అందించాలని టీబీపీ ఎల్ ఎల్ సి  డీసీ చైర్మన్ మిక్కిలినేని వెంకట శివప్రసాదరావు  కోరారు. సోమవారం తుంగభద్ర ప్రాజెక్ట్ దిగువ కాలువకు  2025 నీటి విడుదల సమావేశం ఆదోని తుంగభద్ర ప్రాజెక్టు కార్యాలయంలో  పి సి చైర్మన్ టిప్పు సుల్తాన్ అధ్యక్షతన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పాండురంగయ్య ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో డి సీ చైర్మన్లు  మిక్కిలి నేని వెంకట శివప్రసాదరావు , అనంత సేన,  పెద్దకడబూరు నరవ రమాకాంతరెడ్డి, బి ఖాసీం, గోవర్ధన్ రెడ్డి, బావిగడ్డ ఉసెన్సాబ్, మహేశ్వర్ రెడ్డి, విజయ్ ధర్మారెడ్డి టీసీ మెంబర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో టీబీపీ ఎల్ఎల్సీ డిసి ప్రెసిడెంట్ మిక్కిలినేని వెంకట శివప్రసాదరావు మాట్లాడుతూ ఆంధ్ర రైతులకు రావలసిన నీటి వాటాను ఖచ్చితంగా ఇవ్వాలని కోరారు. ప్రతిరోజూ 600 క్యూసెక్స్ లు,  అదేవిధంగా 22 టి ఎం సి ల నీటి వాటాను విడుదల చేయాలని కోరారు.  నీటి వాటా 22 టీఎంసీల నీటిలో 17 టీఎంసీలు మాత్రం  తుంగభద్ర దిగువ కాలువకు వ్యవసాయానికి ఇచ్చి మిగిలిన ఐదు టీఎంసీలు హెచ్ఎల్సీ కాలువకు  మళ్లిస్తున్నారని రైతులకు నీరు సంపూర్ణంగా పంటకు అవసరమైనంతగా అందించిన తర్వాతే  నీటిని మళ్ళించాలని తెలియజేశారు. రైతుల నీటి వాటాలో కోత పెడితే రైతుల కోసం రైతులతో కలిసి బోర్డు ముందు బైఠాయిస్తామని హెచ్చరించారు. కర్ణాటక రైతుల జరచౌర్యంతో ఆంధ్ర సరిహద్దుల్లో నీటి మీటర్ల రీడింగ్ ను చూపించడం కోసం డిపిల షట్టర్లు దించివేసి కృత్రిమ నీటి కొరతను రైతులకు సృష్టిస్తున్నారని ఇది సరికాదని  తెలియజేశారు. తుంగభద్ర జలాశయానికి కొత్త గేట్లు ఏర్పాటు కోసం రబికి నీటి విడుదల లేదని అంటున్నారని నీటి విడుదల లేకపోతే రైతులు పంటలు వేయక ఆర్థికంగా నష్టపోతారని అందువల్ల రెండవ పంట ముగిసిన తర్వాత కొత్త గేట్ల ఏర్పాటు ప్రక్రియను మొదలుపెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి ఈ షపి ఏ ఈ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author