NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బ్రాహ్మణుల వద్ద నుంచి నగదు వసూలు.. ఫేక్  పట్టాలు పంపిణీ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు    :  నేడు కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం  కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సంకల్ బాగ్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మధ్యాహ్నం సమావేశమై  గత 3 రోజుల పాటు  ప్రచారంలో ఉన్న  బ్రాహ్మణులకు  పుల్లారెడ్డి కాలేజీ  వెనుక ప్లాట్లు  వేసి  ఇస్తున్నారు.  అని పాణ్యం ఎమ్మెల్యే  ఇస్తున్నారు  అని  కొంత మంది నకిలీ నాయకులు  తయారై ఒక్కొక్కరి వద్ద 15000/- వసూలు చేస్తున్నారు ఫేక్  పట్టాలు పంపిణీ చేశారు. అని  అన్నారు, ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేకుండా  వీరు  ఎలా పట్టాలు మంజూరు చేశారు  ఏమండీ స్థానిక కర్నూలులో ఎమ్మెల్యే కు గానీ  బ్రాహ్మణ సంఘం  వారికి గాని తెలియకుండా  బ్రాహ్మణులకు  ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎవరూ  చెప్పారు  ,స్థానిక  మాధవి నగర్ లో వున్న  కొంత మంది నాయకులు ఒక గ్రూపు గా  తయారై పేద  బ్రాహ్మణుల ను  మోసం చేస్తున్నారని  అన్నారు. అట్టి వారి  ఆట  కష్టించి  నష్ట పోయిన  వారికి  వడ్డీతో సహా  కలిపి  మొత్తం వారి  పైకం  వారికి  ఇప్పించాలని   కోరారు,  అలా ఇవ్వని పక్షంలో  నష్టం పోయిన వారు  తగు ఆధారాలతో  కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం నాయకులు ను  కలసిన  వారు  పోలీస్ ఆఫీసర్  లను  కలసి  మీ డబ్బు వసూలు చేయడం ద్వారా మీకు  తగు న్యాయం చేస్తామని తెలిపారు  , ఇక ముందు కూడా  ఇలాంటి  నకిలీ వారి నుంచి దూరంగా ఉండాలని  సూచించారు ఈ  సమావేశం         సండేల్ చంద్రశేఖర్  ఆధ్వర్యం లో నిర్వహించి నారు  ఇందులో  చల్ల నాగరాజ శర్మ, చెరువు వెంకట దుర్గా ప్రసాద్,  కంచు గంటల శ్యామ్ సుందర్ రావు, నాగవరం రాజశేఖర్, ప్రసాదరావు,  టివి రవిచంద్రశర్మ , మహేష్, ప్రసన్న, గురు  ,శివన్న ,తదితర  బ్రాహ్మణులు  ఈ మోసాలు జరుగుతున్నాయి  ప్రభుత్వం  వారు  వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

About Author