ఏడాది కాలం పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలో అడుగెడుతున్న కలెక్టర్
1 min read

కె.వెట్రిసెల్వి కి శుభాకాంక్షలు
ఏపీ ఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్
500 నోట్ బుక్స్ ని జిల్లా కలెక్టర్ కి అందజేసిన ఏపీఎన్జీవో సంఘం సభ్యులు
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు :ఏలూరు జిల్లా కలెక్టర్ గా వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరం లోకి అడుగిడుతున్న సంధర్భంగా కె.వెట్రిసెల్వి కి ఏపీ ఎన్జీవో సంఘం శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, ఏలూరు తాలుకా అధ్యక్షుడు గోన్నూరి శ్రీధర్ రాజు, ఎన్జీజివోస్ అసోసియేషన్ నాయకులు కె ఎస్ఆర్ మోహన్,యండి,గంగాధర్, రమేష్ ,పూడి శ్రీనివాస్ మరియు మహిళా విభాగం సభ్యులు.కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ గా ఈ సంవత్సర కాలంలో ఉద్యోగుల సంబంధించిన అనేక సమస్యలు పరిష్కరించారని. ఏలూరు జిల్లాని ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రులు మరియు ఇన్చార్జి మంత్రులు అందరి సహాయ సహకారాలుతో అభివృద్ధి పధంలో కి తీసుకెళుతున్నారని ఇది జిల్లా ప్రజలకు శుభ పరిమాణం అని చోడగిరి శ్రీనివాస్ తెలిపారు.కలెక్టర్ కె.వెట్రిసిల్వి స్పందిస్తూ మీ అందరి సహాయ సహకారాలు ఎప్పుడూ జిల్లా యంత్రాంగానికి అందించి ప్రజలకు అందుబాటులో ఉంటూ జిల్లా అభివృద్ధికి తోడ్పపడాలని కోరుతూ ఎన్జీవోస్ అసోసియేషన్ నాయకులుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం పేద విద్యార్థులకు 500 నోట్ బుక్స్ ని ఏపీ ఎన్జీజివోస్ అసోసియేషన్ సంఘ సభ్యులు కలెక్టర్ కి అందజేసారు.

