అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
1 min read

మహానంది, న్యూస్ నేడు: మండలంలోని మసీదుపురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు విశ్వాస నీయ సమాచారం. గత రాత్రి కొందరు వ్యక్తులు కలిసి ఒక చోట మద్యం సేవించారని మిగతావారు వెళ్ళిపోగా ఒక వ్యక్తి మాత్రం గురువారం ఉదయం బావిలో శవం అయి కనిపించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కొందరిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పొరపాటున బావిలో పడ్డారా లేక ఇంకా ఏమైనా జరిగి ఉందా అనేది విచారణలో బయటపడే అవకాశం ఉంది.

