NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లాలో పి యం సూర్య ఘార్ కింద సోలార్ ప్యానల్ యూనిట్లు రిజిస్ట్రేషన్లు

1 min read

స్థాపన ప్రక్రియను వేగవంతం చేసి మంచి ప్రగతిని సాధించాలి

వచ్చిన ధరఖాస్తులను 10 రోజుల్లోపుగా మంజూరు చేసి,72 గంటల్లోగా బ్యాంకు రుణాలు మంజూరు చేయాలి

జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : జిల్లాలో పి యం సూర్య ఘార్ కింద సోలార్ ప్యానల్ యూనిట్లు రిజిస్ట్రేషన్లు, స్థాపన ప్రక్రియను వేగవంతం చేసి మంచి ప్రగతిని సాధించాలని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో  ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం అమలులో భాగంగా సోలార్ రూఫ్ టాఫ్ యూనిట్ల రిజిస్ట్రేషన్లు,స్థాపన ప్రగతిని విద్యుత్తు శాఖ అధికారులు,బ్యాంకర్లు,సోలార్ కంపెనీలు ప్రతినిధులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సమావేశం నిర్వహించారు.జిల్లాలో 5 లక్షలు కుటుంబాలు ఉండగా ఇప్పటికీ కనీసం 1లక్ష ధరఖాస్తులు రావాలని,70 వేలు లక్ష్యం కాగా ఇంతవరకు  52 వేలు ధరఖాస్తులు అందాయన్నారు. లక్ష్యసాధన కోసం రోజుకి వెయ్యి ధరఖాస్తులు చేసినా నెలకు 30 వేలు ధరఖాస్తులు వచ్చేవన్నారు. వెనుకబడి ఉండుటకు కారణాలను కలెక్టర్ సమీక్షించారు.సిబ్బంది ఎంత మంది ఉన్నారని,రోజుకి ఎన్ని ఇండ్లు తిరుగుతున్నారని,ఎన్ని ధరఖాస్తులు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.ఈ రోజు వరకు వచ్చిన ధరఖాస్తులు మండలాలు వారీగా సమీక్షించి,లోటుగా ఉన్నచోట జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి దిశానిర్దేశం చేశారు. జిల్లాలో ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం జిల్లాలో మంచి లక్ష్యాలను సాధించాలన్నారు.స్వయంగా విద్యుత్తు ఉత్పత్తి చేసుకునేందుకు, ఆదాకోసం  సోలార్ ప్లాంటు ఏర్పాటు చేసుకున్నామని లబ్ధిదారులు సంతోషంగా చెప్పేలా ఉండాలన్నారు.బ్యాంకు రుణం మంజూరులో ఏటువంటి జాప్యం జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి,72 గంటల్లోగా రుణాలు మంజూరు చేయాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు. సోలార్ యూనిట్ల స్థాపన వల్ల కలిగే ప్రయోజనాలను  విస్తృత స్థాయిలో ప్రజలలో అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో ప్రధానమంత్రి  సూర్యఘర్ యోజనపథకం విజయవంతం అయ్యేందుకు అధికారులు,సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని అన్నారు.మంజూరైన యూనిట్లు స్థాపనలో వెండార్స్  ఏటువంటి జాప్యం లేకుండా పనులు  పూర్తిచేసి వాడుకలోకి తీసుకురావాలని అన్నారు. యూనిట్ల స్థాపనలో ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులు దృష్టికి తీసుకు వచ్చి పరిష్కరించు కోవాలని, మంచి ప్రగతిని సాధించి ఏలూరు జిల్లాను అగ్రగామిగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అన్నారు.ఈ సమావేశంలో విద్యుత్తు శాఖ సూపర్డెంటు ఇంజనీరు పి.సాల్మన్ రాజు,లీడ్ బ్యాంకు మేనేజరు డి.నీలాద్రి,ఇఇ ఏ.రాధాకృష్ణ,డిఇ,నోడల్ అధికారి ఏ.రమాదేవి, బ్యాంకర్లు,వివిధ మండలాలు విద్యుత్తు శాఖ అధికారులు, సోలార్ వివిధ కంపెనీలు ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.

About Author