20 లీటర్ల నాటుసారా స్వాధీనం
1 min read

న్యూస్ నేడు హొళగుంద : ఆదివారం ఉదయం హోళగుంద మండల పరిధిలోని నెర్ణికి తాండ గ్రామంలో ఆలూరు సిఐ రవి శంకర్ రెడ్డి , హోళగుంద ఎస్సై దిలీప్ కుమార్ మరియు ఆలూరు ఎస్సై మహబూబ్ బాషా వారి సిబ్బందితో కలిసి గ్రామంలో మరియు చుట్టుపక్కల కొండ ప్రాంతాలలో కార్డెన్ సర్చ్ నిర్వహించి వెంకటేష్ నాయక్ అను వ్యక్తి వద్ద నుంచి 20 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి మరియు సుమారు 400 లీటర్ల బెల్లం ఊట ను ధ్వంసం చేయడమైనది. మండల పరిధిలో ఎక్కడైనా నాటుసారా తయారుచేసినా అమ్మినా కఠిన చర్యలు తీసుకోబడును అని తెలిపారు.

