బహిరంగప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే చర్యలు
1 min read

గత 5 నెలలలో ఒపెన్ డ్రింకింగ్ పై 8,140 కేసులు నమోదు.
కర్నూలు, న్యూస్ నేడు: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు ఎవరైనా అసౌకర్యం కల్గిస్తే చర్యలుంటాయని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గురువారం తెలిపారు. బహిరంగంగా మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని, రోడ్లు, నడకదారులు, పార్కులు, వ్యాపార దుకాణ సముదాయాలు, శివారు ప్రాంతాలు మరియు వల్నరబుల్ ఏరియాలలో ప్రజాజీవనానికి ఆటంకం కలిగించే వారి పై పబ్లిక్ న్యూసెన్స్ కింద పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు.జిల్లా వ్యాప్తంగా గత 5 నెలలలో( ఫిబ్రవరి – 1,976 మార్చి – 1,041 ఏప్రిల్ – 1,926 మే – 1,435 జూన్ -1,762 ) బహిరంగప్రదేశల్లో మద్యం సేవించి, ప్రజా శాంతికి భంగం కలిగించిన వారి పై మొత్తం 8,140 కేసులు నమోదు చేశారని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ తెలిపారు.

