9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
1 min read

న్యూస్ నేడు డోన్: కార్మిక చట్టాల పరిరక్షణ కొరకు లేబర్ కోడ్ ల రద్దు కొరకు అంగన్వాడీల సమస్యల పరిష్కారం కొరకు ఈనెల 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అంగన్వాడీలు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జి.శేభారాణి,సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి టి.శివరాం,పట్టణ అధ్యక్షులు నక్కీ శ్రీకాంత్,మండల అధ్యక్ష,కార్యదర్శులు పి.రామాంజనేయులు,ఎ.వి.భాస్కర్ రెడ్డి,కోశాధికారి బి.నాగమద్దయ్య అంగన్వాడీలకు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం నందు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు సులోచన అధ్యక్షతన ప్రాజెక్టు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పేద గర్భిణీలు,బాలింతలు, చిన్నపిల్లలకు అంగన్వాడీ వర్కర్లు,హెల్పర్లు,మినీ వర్కర్లు అనేక సేవలు అందిస్తున్నారన్నారు. అంగన్వాడి సెంటర్ల నిర్వహణకు రకరకాల పెట్టుబడులు పెట్టి సెంటర్లు నిర్వహిస్తున్నారని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకు వేతనాలు మాత్రం పెరగడం లేదని అంగన్వాడీలకు కేవలం గౌరవ వేతనాలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కానీ అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు అయినందున సంక్షేమ పథకాలు అమలు కావడంలేదని తల్లికి వందనం అమలు కావడం లేదని,రిటైర్డ్ అయిన వారికి పెన్షన్ రావడంలేదని,రేషన్ కార్డు కొరకు అప్లై చేస్తే ప్రభుత్వ ఉద్యోగులు అని తిరస్కరిస్తున్నారని కావున అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా నైనా గుర్తించి కనీస వేతనం 26,000 ఇవ్వాలని లేదా ప్రభుత్వ సంక్షేమ పథకాలనైనా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.గ్రాట్యూటీ జీవో నెంబర్ 8ని మార్పు చేయాలని,పెన్షన్,పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని,వేసవి సెలవులు ఇవ్వాలని,అంగన్వాడి సెంటర్ల నిర్వహణకు రకరకాల యాపులు పెట్టారని కానీ ఫోన్లు సరిగా పనిచేయడం లేదని అనేక ప్రాంతాలలో నెట్ సిగ్నల్స్ ఉండడం లేదని కావున సెంటర్ నిర్వహణకు ట్యాబ్ లు ఇవ్వాలని,ఎఫ్.ఆర్.ఎస్ ను రద్దు చేయాలని,బాల సంజీవిని యాప్ లో మార్పులు చేయాలని వారు కోరారు.లేబర్ కోడ్ లను రద్దు చేయాలని,రైల్వే, విద్యుత్,స్టీలు,బ్యాంకులు, ఇన్సూరెన్స్ తదితర ప్రభుత్వ రంగాల్లో ప్రైవేటీకరణ విధానాలు ఆపాలని వారు డిమాండ్ చేశారు.సమస్యల సమస్యల పరిష్కారం కొరకు ఈ నెల 9న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో అంగన్వాడీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అంగన్వాడీలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డోన్ ప్రాజెక్ట్ కు సంబంధించి డోన్ బేతంచెర్ల ప్యాపిలి మండలాల నుండి అంగన్వాడీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు.
నూతన కమిటీ :
డోన్ ప్రాజెక్టు గౌరవాధ్యక్షులుగా నక్క శ్రీకాంత్,అధ్యక్షులుగా ఎన్.సులోచనమ్మ,ప్రధాన కార్యదర్శిగా నాగలక్ష్మి,ఉపాధ్యక్షులుగా రహమద్బి,సహాయ కార్యదర్శిగా గుల్జార్ బి,కోశాధికారిగా సుమలత,కమిటీ సభ్యులుగా మేరీ,వరలక్ష్మి, అనసూయ,శ్రీలత,ఆదిలక్ష్మి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

