NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిరు పేద ప్రజలకు వరం సీఎం సహాయానిధి పథకం

1 min read

పార్టీలకతీతంగా సియం సహయనిధి పథకం

రూ 2,87,409 రూపాయల చెక్కులను లబ్దిదారులకు అందచేసిన మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి

మంత్రాలయం, న్యూస్​ నేడు : నిరు పేద ప్రజలకు సియం సహయనిధి పథకం వరమని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మాధవరం టిడిపి కార్యాలయంలో మంచాల సొసైటీ ఛైర్మెన్ రామకృష్ణ రెడ్డి, యువ నాయకులు రాఖేష్ రెడ్డి ఆధ్వర్యంలో సియం సహయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నిధులు అందిస్తున్నారన్నారు. మంత్రాలయం కు చెందిన ప్రదీప్ కు రూ 41,250 ,చెట్నీహళ్లి కి చెందిన వడ్ల నరసింహులు కు రూ 41,556 , చిలకలడోన కు చెందిన దాసరి వరలక్ష్మి కి రూ 20,000,  గోండుపోగుల ప్రకాష్ కు రూ 75,000,అలాగే  కౌతాళం మండలం లోని కౌతాళం చాకలి నాగవేణికి 40,503 రూపాయలు,ఎం. వినోద్ కు 32,900 రూపాయలు, హల్వి గ్రామం లలితకు 36200 రూపాలయల చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సతీష్ నాయుడు, సురేష్ నాయుడు ,టిప్పు సుల్తాన్, చావిడి వెంకటేష్,చంద్ర, మంత్రాలయం వరదరాజులు, నరసింహ, రాఘవేంద్ర తదితరులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author