ఏపీ పోలీసులకు మెడల్స్ ప్రధానం
1 min read

మహానంది , న్యూస్ నేడు: ఏపీ పోలీసులకు మెడల్స్ ను ప్రభుత్వం ప్రధానం చేస్తున్నట్లు మహానంది ఎస్ఐ. రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మహానంది పోలీస్ స్టేషన్లో మెడల్స్ ను సిబ్బందికి అందజేశామన్నారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భం తో పాటు పోలీస్ వ్యవస్థ ఏర్పడి కూడా 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత స్థాయి అధికారుల నుండి క్రింది స్థాయి సిబ్బంది వరకు మెడల్స్ ను ప్రభుత్వం అందజేస్తున్నట్లు తెలిపారు. మెడల్స్ నందు ప్రధానంగా త్రివర్ణ పతాకంతో కూడిన ట్యాగ్ తో పాటు అశోక చక్రం, 4 సింహాలు కలిగి ఉన్న మెడల్స్ ను సిబ్బందికి అందజేస్తున్నట్లు తెలిపారు. వీటిని సిబ్బంది ఆగస్టు 15వ తేదీ నుండి ధరించనున్నట్లు తెలుస్తుంది.


