NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు: డోన్ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్​ఎఫ్​) ద్వారా మంజూరైన రూ.25,50,925/- (అక్షరాల ఇరవై ఐదు లక్షలు యాభై వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు) విలువైన చెక్కులు మరియు ఎల్​.ఓ.సి లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డోన్ శాసనసభ్యులు  కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి  పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను స్వయంగా అందజేశారు. లబ్ధిదారులు ముఖ్యంగా ఆరోగ్య సంబంధిత అవసరాల కోసం నిధులు పొందినట్టు తెలియజేయబడింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ, “ప్రజల అవసరాలను ప్రభుత్వ స్థాయిలో గుర్తించి, అవసరమైన సాయాన్ని అందించడం మా బాధ్యత. ముఖ్యమంత్రి సహాయ నిధి వంటి పథకాల ద్వారా బాధితులకు ఉపశమనం కలిగించేందుకు మా ప్రయత్నం కొనసాగుతుంది, అని ఎమ్మెల్యే  పేర్కొన్నారు.

About Author