కరెంట్ బిల్లు తగ్గించమని స్మార్ట్ మీటర్లు బిగించవద్దని ప్రజలు నిలదీయండి
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: అడ్డదిడ్డంగా పాలకవర్గాలు ప్రజలపై విద్యుత్ భారాలను మోపుతున్నాయని, ప్రజలను చైతన్యపరిచి వాటిని తిప్పి కొట్టేందుకు ప్రతి కార్యకర్త కార్మికుడు పనిచేయాలని సిపిఎం పార్టీ నాయకులు ఎస్.ఏ. చిన్న రహిమాన్ పిలుపునిచ్చారు.శనివారం ప్యాపిలి పట్టణంలోని సిఐటియు కార్యాలయం లొ లక్ష్మణ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్.ఎ. చిన్న రహిమాన్,రామాంజినేయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్మాట్ మీటర్ల ద్వారా ప్రజల మెడలకు ఉరితాల్లు బిగించే ప్రయత్నం చేస్తోందన్నారు. వ్యాపార సముదాయాలకు ఇప్పటికే స్మార్ట్ మీటర్లను బిగించడం పూర్తి చేసిన ప్రభుత్వం, 200 యూనిట్లు పైబడి విద్యుత్ బిల్లు వచ్చే గృహ వినియోగదారులకు ఈ స్మార్ట్ మీటర్లు బిగించేందుకు కుట్ర పన్నుతోందన్నారు. యూనిట్ కు 40 పైసలు వసూలు చేస్తున్న విధానాన్ని ఆగస్టు 1 తేదీ నుండి నిలిపివేయాలని, తప్పుడు లెక్కలు ఇచ్చి అదనపు చార్జీలు వసూలు చేసిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలన్నారు.విద్యుత్ చార్జీలు పెంచబోమని తగ్గిస్తామని ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నారు. అధికారంలోకి రాకముందు లోకేష్ తన యువగలం పాదయాత్ర సందర్భంగా స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని పిలుపునిచ్చి, వారే నేడు అధికారంలోకి వచ్చాక స్మార్ట్ మీటర్లు బిగించడం కార్పొరేట్ల లాభాల కోసమే పాలకవర్గాలు అన్నదే స్పష్టంగా కనబడుతుందన్నారు. మీటర్ అయ్యే ఖర్చు పదివేల నుండి 15 వేల వరకు ఉంటుందని 93 నెలలలో వాయిదాల పద్ధతిలో మనమే కట్టాలి. సెల్ ఫోన్ రీఛార్జ్ మాదిరిగా ఈ మీటర్ బిగిస్తే ముందే బిల్లు కట్టాలి. పగలు ఒక రేటు రాత్రి ఒక రేటు పెట్టి ప్రజల నుండి దోపిడీ చేసి ఆదాని అంబానీ లాంటి వారికి కట్టబెట్టాలని కూటమి ప్రభుత్వం సిద్ధమైంది అన్నారు. ఆదాని ,మోడీ కావాలో ప్రజలు కావాలో కూటమి ప్రభుత్వం తేల్చాలి అన్నారు .తొలి అడుగు కార్యక్రమంలో ప్రజలు కార్మికులు శ్రామికులు కరెంటు బిల్లు తగ్గించమని స్మార్ట్ మీటర్లు బిగించవద్దని స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసి ప్రతి కార్యకర్త, కార్మికులు పోరాటాలను నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సిఐటియు మండల నాయకులు రంగస్వామి, పట్టణ నాయకులు శ్రీనివాసులు, ఇలియాజ్ ,రవి, నాగేంద్ర ,రాజు తదితరులు పాల్గొన్నారు.

