NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహాసభలను జయప్రదం చేయండి

1 min read

రాష్ట్ర బిసి సంక్షేమ యువజన సంఘం అధ్యక్షులు :చల్లా అనుదీప్

ప్యాపిలి, న్యూస్​ నేడు: ఈనెల 17న విజయవాడలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లకా వెంగళరావు యాదవ్ ఆధ్వర్యంలో తలపెట్టిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహాసభలను జయప్రదం చేయాలని  యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు చల్లా అనుదీప్ పట్టణంలోని తన కార్యాలయంలో గోడపత్రికలను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షులు చల్లా అనుదీప్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఓబీసీలను ఒక్క తాటిపైకి తెస్తూ విజయవాడ కేంద్రంగా నిర్వహిస్తున్న మహాసభలకు కేంద్ర మంత్రులతో పాటు అతీరత మహారధులు హాజరవుతున్నారని కావున ఈ మహాసభలను జయప్రదం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఓబీసీలను ఉద్దేశించి అన్నారు. ఓబిసిల హక్కుల సాధనకై జరుగుతున్న ఈ మహాసభలకు ఓబీసీ సోదరులంతా బాధ్యతగా పాల్గొనాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లొ జనసేన నాయకులు కిష్టిపాడు చంద్ర,పి.వెంకటేష్, దూదేకుల మమ్మద్ రఫీ, పచ్చ చంద్రశేఖర్ యాదవ్, షేక్ ముస్తఫా ,మంగలి రాజు, బోయ తిమ్మరాజు ,కటిక రమేష్, మేకలు ఇంటి రాజు తదితరులు పాల్గొన్నారు.

About Author