NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

2026వ రాష్ట్ర ప్రభుత్వ క్యాలెండర్ ను దృగ్గణితం ప్రకారము అమలు జరపాలి!

1 min read

విజయవాడ , న్యూస్​ నేడు:  2026వ సంవత్సరపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెలవు, పండగ దినాల క్యాలెండర్ ను దృగ్గణితం ప్రకారము అమలు జరపాలని భారతీయ తెలుగు దృగ్గణిత పంచాంగకర్తల సమాక్య సేవా సంఘం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ద్విభాష్యం సుబ్రహ్మణ్యం శర్మ మాట్లాడుతూ దృగ్గణితం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యాలెండర్ ను భారతదేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరుగుతున్నాయని, మన రాష్ట్రీయ పంచాంగం ప్రకారం ఆ క్యాలెండర్ లోని పండగ తిధులు మనకు సరిపోవుచున్నాయి కనుక మన రాష్ట్రానికి కూడా దృగ్గణితం ప్రకారం గణనము చేసిన తేదీల యొక్క క్యాలెండర్ ను తప్పనిసరిగా ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో  కమిటీ సభ్యులు కె ఆర్ వి ప్రసాద్, పులిపాక చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

About Author