NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన ఆలూరు టీడీపీ ఇంచార్జి వీరభద్ర గౌడ్

1 min read

ఆలూరు న్యూస్ నేడు :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు  నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా గురువారం కర్నూలు విమానాశ్రయానికి విచ్చేశారు.ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు,నాయకులతో కలిసి ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి వీరభద్ర గౌడ్  సీఎం చంద్రబాబు  నాయుడు కి ఘన స్వాగతం పలికారు.అనంతరం ఆలూరు నియోజకవర్గ  సమగ్రాభివృద్ధికి సహకరించాలని …వెనుక బాటుకు గురైన  నియోజకవర్గాన్ని అత్యధిక నిధులిచ్చి ఆదుకోవాలని సిఎం కు విన్నవించారు. రైతుల పంటలకు నీరు అందించేందుకు లిఫ్ట్ ఇరిగేషన్& వెధవతి  ప్రాజెక్ట్ లకు పూర్తి సహకారం అందించి,రహదారుల నిర్మాణాలకు,మరమ్మతులకు సహకారం అందించాలని.రాష్ట్రంలో అత్యంత వెనుకబాటుకు గురైన ఆలూరు నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ని  సందర్భంగా నియోజకవర్గంకు అత్యధిక నిధులను మంజూరు చేయాలని  విన్నవించారు…. సీఎం సానుకూలంగా స్పందించి  ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలియజేసినట్లు  తెలిపారు అని ఆలూరు టీడీపీ ఇంచార్జి వీరభద్ర గౌడ్  అన్నారు.

About Author