33 గ్రామాలకు త్రాగునీటి వసతిని కల్పించాలని నిరసన
1 min read

ఆస్పరి చౌరస్తా లో రాస్తలో నిరసన నిర్వహించారు…
ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి
ఆలూరు ,న్యూస్ నేడు: ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి విలేకరులతో మాట్లాడుతూ..ఆస్పరి మండలంలో ఉండే 33 గ్రామాలకు తీవ్రంగా త్రాగునీటి సమస్య ఉంది అని అన్నారు. నేను ఎలక్షన్ ప్రచారంలో ప్రతి గ్రామంలో వెళ్లినప్పుడు ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ మాకు త్రాగు నీటి సమస్య ఎక్కువగా ఉందని తెలిప్పారు. వేసవి కాలం వస్తే త్రాగునీరు సమస్య అధికంగా ఉంటుంది. జోలహపురం గ్రామంలో ఎస్ ఎస్ ట్యాంక్ కట్టాలని చాలాసార్లు నేను అధికారులు అడిగాను, కానీ వాళ్లు పట్టించుకోవడం లేదు. కూటం ప్రభుత్వం దొంగ హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారు, కానీ ప్రజల సమస్యల గురించి గాలికి వదిలేశారు. నేను జిల్లా పరిషత్ మీటింగ్ లో కానీ అన్ని మీటింగ్ లో కూడా ఆస్పరి మండలంలో అన్ని గ్రామాలకు త్రాగునీటి వసతి కల్పించాలని అధికారులను అడిగాను.రాష్ట్ర ఇరిగేషన్ మంత్రివర్యులు మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు కూడా చాలాసార్లు నేను మెమోరండం ఇచ్చాను. ఆస్పరి మండలంలో ఉన్న 33 గ్రామాలకు కూటమి ప్రభుత్వం నీటి సమస్య తీర్చకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలపడం జరిగింది. ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు,తాలూకా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివిఆర్ అభిమానులు పాల్గొన్నారు.


