NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కూటమి పాలనలో జరిగిన అభివృద్ధి, ప్రజా సంక్షేమం వైసీపీకి కనబడవా….?

1 min read

కూటమి పాలనలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు మేము సిద్ధం….వైసీపీ నాయకులు సిద్ధమా….?

ఎం ఎల్ ఎ విరూపాక్షి కి సవాల్ విసిరిన కూటమి నాయకులు…..

హొళగుంద న్యూస్ నేడు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో  కూటమి పాలనలో జరిగిన అభివృద్ధి,ప్రజా సంక్షేమం ఎం ఎల్ ఎ విరూపాక్షి కి,వైసీపీ నాయకులకు కనబడవా అని కూటమి నాయకులు మండిపడ్డారు.కూటమి పాలనలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు మేము  సిద్ధం….వైసీపీ నాయకులు సిద్ధమా…? అని సవాల్ విసిరారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో కూటమి నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి నెలలోనే వృద్ధాప్య పెన్షన్లు 3000 రూపాయల నుండి 4000/రూపాయలకు, వికలాంగుల పెన్షన్లు 3000 రూపాయల నుండి 6000 రూపాయలకు పెంచడం జరిగిందని అన్నారు.దీపం పథకం ద్వారా ఏడాదికి  3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామని అన్నారు.పేదల కడుపు నింపేందుకు 5 రుపాయలకే నాణ్యమైన భోజనం అందించే అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించామని అన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సి ద్వారా 16431 పోస్టులు ప్రకటించి డీఎస్సీ పరీక్షలు విజయవంతంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా నాణ్యమైన సన్నబియ్యంలో ఇంటర్ విద్యారులకు కూడా మధ్యాహ్నం భోజన పథకం అందిస్తున్నామని అన్నారు. వైసిపి పాలనలో బడికి వెళ్లే పిల్లలకు ఒకరికే అమ్మ ఒడి పథకం అందిస్తే, కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం పథకం ద్వారా ఒక ఇంట్లో ఎంతమంది బడికి వెళ్లే పిల్లలున్నా పార్టీలకతీతంగా  అందరికీ తల్లికి వందనం పథకం అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హోలగుంద మండల పరిధిలోహొన్నుర్ క్యాంపు గ్రామానికి 5.74 కోట్ల రూపాయల నిధులతో రోడ్డు నిర్మాణం పూర్తిచేశామన్నారు.అదేవిధంగా చిన్నహ్యాట గ్రామానికి రోడ్డు పనులు ప్రారంభించామని గుర్తు చేశారు. గ్రామాల్లో దాదాపు 11వేల కోట్ల రూపాయల నిధులతో సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదే అని అన్నారు.వైసీపీ పాలనలో హోలగుంద – ధనాపురం రోడ్డు కు నాలుగు సార్లు భూమి పూజ చేసి పనులు ప్రారంభించకుండా రోడ్డు నిర్మాణ పనులను అర్థాంతరంగా ఆపేశారని మండిపడ్డారు.ఇప్పుడు కుంటిమి ప్రభుత్వంపై విమర్శించడం హాస్యాస్పదమని అన్నారు.హోలగుంద – ధనాపురం రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని త్వరలోనే రోడ్డు నిర్మాణపుణులు ప్రారంభమవుతాయని తెలిపారు. అధికారం చేపట్టిన ఏడాదిలోపే ఇన్ని సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, వైసిపి నాయకులు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదమన్నారు.వైసీపీ పాలనలో ఒక్క రోడ్డు నిర్మాణం అయినా చేపట్టారు అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే విరుపాక్షి, వైసిపి నాయకులు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పంపాపతి, సీనియర్ నాయకులు దిడ్డి వెంకటేష్,ఎర్రి స్వామి, టిడిపి మైనార్టీ నాయకులు అబ్దుల్ సుభాన్,మోయిన్,జాకీర్,అబ్దుల్ రహిమాన్,తిప్పన్న,వీరన్న గౌడ,జమాపుర బసవ, దిడ్డి నాగప్ప,చిన్న మల్లయ్య,ఆంజనేయులు, లక్ష్మన్న,కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author