NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా తపాలా ఉద్యోగుల దైవార్షిక మహాసభలు

1 min read

మహానంది, న్యూస్​ నేడు:   ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంగం 14వ రాష్ట్ర దైవార్షిక మహాసభల ను ఘనంగా నిర్వహించారు. విజయవాడ సర్కిల్ పరిధిలోని నంద్యాల జిల్లా,చాబోలు గ్రామం లోని ఏ ఎస్ ఆర్ పంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంగం అధ్యక్షులు వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రటరీ ఎస్ ఎస్ మహాదేవయ్య, సి కే సుబ్రమని, రాష్ట్రనాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర డివిజన్ అధ్యక్షులు గా కృష్ణయ్య, రాష్ట్ర కార్యదర్శిగా మర్రెడ్డి, కోశాధికారిగా పి వి నారాయణలను ఎన్నుకున్నారు. రాష్ట్ర మహిళా సంఘం సభ్యుల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈసందర్బంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ తపాలా ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిస్కారానికి కృషిచేస్తామని తెలిపారు. అలాగే ఎనిమిదవ వేతన కమిటీ లో జి డి ఎస్ లను చేర్చడం సమస్యలపై చర్చించడం జరిగింది.ఈ సమావేశంలో రాష్ట్ర అడ హాక్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు, కన్వినర్ జమాల్ బాషా, స్పర్జన్ రాజు, నంద్యాల డివిజన్ కార్యదర్శి శశికుమార్,డిపార్ట్ మెంట్ ఉద్యోగులు, నలుమూలల నుండి విచ్చేసిన తపాలా ఉద్యోగులు భారీగా పాల్గొనడం జరిగింది.

About Author