NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేంద్ర ప్రభుత్వ మెమో నెంబర్ 57 ద్వారా పాత పెన్షన్ ని అమలు చేయాలి

1 min read

 వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్

వై ఎస్ ఆర్ టి ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం సుధీర్

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : 2003 డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులందరికీ కేంద్ర ప్రభుత్వ మెమో నెంబర్ 57ను అమలు చేసి పాత పెన్షన్ విధానాన్ని వై ఎస్ ఆర్ టి ఏ రాష్ట్ర శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాo. భారతదేశంలో సుమారు 16 రాష్ట్రాలు ఇప్పటికే మెమో నెంబర్ 57 అమలు చేస్తూ పాత పెన్షన్ పునరుద్ధరించడం జరిగింది. అదేవిధంగా భారతీయ రైల్వే,తంతి తపాలా,మరియు కొన్ని కేంద్రప్రభుత్వ  సంస్థలు పాత పెన్షన్ పునరుద్ధరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని  కూటమిప్రభుత్వం కూడా మీనమేషాలు లెక్కించకుండా  వెంటనే న్యాయమైన ఈ సమస్యను పరిష్కరించి 2023 లో ఉద్యోగంలో జాయిన్ అయిన ఉపాధ్యాయ, ఉద్యోగులకు పాత పెన్షన్ పునరుద్ధరించాలని వైఎస్ఆర్ టీచర్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తూ, 2023 ఉపాధ్యాయుల పోరాటానికి వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ పక్షాన పూర్తి మద్దతు ఇవ్వడం జరుగుతుందని వైయస్సార్ టి ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం  సుధీర్ ఒక ప్రకటనలో తెలిపారు.

About Author