NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎందరికో.. పునర్జీవం..

1 min read

21 ఏళ్ల యువకుడికి బ్రెయిన్​ డెడ్​..

  • ‘జీవన్​ధాన్​ –ఏపీ’  ద్వారా అవయవదానం
  • – గ్రీన్​ ఛానల్​ ద్వారా హైదరాబాద్​,

కర్నూలు జీజీహెచ్​కు  అవయవాల తరలింపు…

  • బాధిత కుటుంబీకులు, బంధువులను అభినందించిన మెడికవర్​ ఆస్పత్రి యాజమాన్యం

కర్నూలు, న్యూస్​ నేడు:నంద్యాల జిల్లా పాములపాడు మండలం కొత్త బానకచర్ల గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువకుడు మొలక తరుణ్​  బ్రెయిడ్​ డెడ్​ తో మృతి చెందాడు.   కర్నూలు నగరంలోని మెడికవర్​ ఆస్పత్రి ఈ ఏడాది జూన్​ మాసంలో జీవన్​ ధాన్​ – ఏపీ అనుమతి పొందింది. ఈ క్రమంలో తరుణ్​ కుటుంబీకులను, బంధువులను మెడికవర్​ ఆస్పత్రి యాజమాన్యం అవయదానం చేయడం వల్ల కలిగే ఉపయోగాల గురించి క్షుణ్ణంగా వివరించి…  ఒప్పించారు.  దీంతో మెడికవర్​ లో జీవన్​ ధాన్​ – ఏపీ ద్వారా ఫోరిన్​ సిక్​ మెడిసిన్​ హెచ్​ ఓడి డా. సాయి సుధీర్​ నేతృత్వంలో మెడికవర్​ ఆస్పత్రి థియేటర్​లో అవయవ మార్పిడి శస్ర్త చికిత్స నిపుణులు, యురాలజిస్ట్​ డా. అబ్దుల్​ సమద్​  నెఫ్రాలజి డా. సిద్ధార్థ హెరురు,  అనస్థీయ వైద్యులు డా. ప్రవీన్​ సహాయంతో  తరుణ్​ అవయవాలు  సేకరించి… గ్రీన్​ ఛానల్​ ద్వారా హైదరాబాద్​, కర్నూలు జీజీహెచ్​కు , జీవన్​ ధాన్​ – ఏపీ ద్వారా అనుమతి పొందిన ఆస్పత్రులకు తరలించారు. 

అవయవ దానం.. గొప్ప నిర్ణయం..

బాధితుడి తల్లిదండ్రులు మొలక రాజు, ఈరమ్మ,  బంధువులు మొలక తరుణ్​ అవయవదానం కు అంగీకరించడం అభినందించదగ్గ విషయమని, తరుణ్​ ఎందరికో పునర్ఝీవం ఇచ్చినట్లవుతుందన్నారు మెడికవర్​ ఆస్పత్రి హెచ్​ ఓడి మహేశ్వర రెడ్డి . ఈ సందర్భంగా  తరుణ్​ తల్లిదండ్రులను  ఇన్​చార్జ్​ డీఎం అండ్​ హెచ్​ ఓ  డా. భాస్కర్​ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఆ తరువాత తరుణ్​ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

About Author