NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాధ్యతలు చేపట్టిన పంచాయితీ కార్యదర్శులు..

1 min read

నందికొట్కూర్ లో-4, మిడుతూర్ లో ఏడుగురు బదిలీ..

నందికొట్కూరు , న్యూస్​ నేడు : పంచాయితీ కార్యదర్శులుగా పనిచేస్తూ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లా అధికారులు పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేస్తూ వారికి స్థానాలను కేటాయించారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని చింతలపల్లె పంచాయితీ కార్యదర్శి వేల్పుల వినయ్ చంద్ర 49 బన్నూరుకు బదిలీ అయ్యారు.ఇక్కడ పనిచేస్తున్న ఎస్ బీజాన్ భీ చింతలపల్లెకు వెళ్లారు.సుంకేసుల పీఎస్ రఘురాం ఆత్మకూరు మండలం వడ్ల రామాపురంకు వెళ్లారు.సుంకేసులకు పీరు సాహెబ్ పేట నుండి వినోద్ వచ్చారు.పీరు సాహెబ్ పేట (జీపీ)కు ఘణపురం నుండి శ్వేత వచ్చారు.ఎన్ అనురాధ కోనేటమ్మ పల్లెకు వెళ్లారు. తిమ్మాపురం పీఎస్ ఫరీద్ కరివేనకు ఇక్కడికి బానకచర్ల నుండి ప్రవీణ్ కుమార్,పీరు సాహెబ్ పేట-2 కు డోన్ నుండి నాగమణి వచ్చినట్లు ఎంపీడీఓ పి దశరథ రామయ్య తెలిపారు.మిడుతూరు పీఎస్ ఇన్చార్జిగా బి శివకళ్యాణ్ సింగ్,పైపాలెం ఇన్చార్జిగా షేక్షావలి,జలకనూరు ఇన్చార్జిగా షఫీ,అలగనూరు ఇన్చార్జిగా సుగుణావతి లను ఇన్చార్జిగా నియమించినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా మండలంలోని 14 సచివాలయాల్లో పనిచేస్తున్న వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగులు అందరూ బదిలీలు అయినట్లు ఎంపీడీవో తెలిపారు.అదేవిధంగా నందికొట్కూరు మండలంలో శాతనకోట పీఎస్ గా అబ్దుల్ రహీం,కోనేటమ్మపల్లెకు ఎన్ అనురాధ,దామగట్లకు మల్లికార్జున,బ్రాహ్మణకొట్కూరు-2 కు రేగడగూడూరు నుండి ఇక్కడికి బదిలీపై వచ్చినట్లు ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ తెలిపారు.

About Author