NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీమద్ది ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకం

1 min read

వివిధ సేవల,విరాళాల ద్వారా  1,10,79O/-లు ఆదాయం సమకూరినది                  

కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి చందన

నిత్యాన్నదాన సత్రంలో భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : గురవాయిగూడెం గ్రామములో శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయమువద్ద  ప్రతి  శనివారం నిర్వహించు అభిషేకసేవ సందర్భముగా  ఆలయ ముఖమండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చకస్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. ఏలూరు జిల్లా,  పావులూరివారిగూడెం నకు చెందిన శ్రీనివాసా భజన మండలి వారు  హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.  సదరు కార్యక్రమములో  పలువురు భక్తులు పాల్గొన్నారు. మద్యాహ్నం  వరకు  దేవస్థానమునకు వివిధ సేవల, విరాళాల  ద్వారా   రూ:1,10,790/-లు  సమకూరినది. స్వామివారి నిత్యాన్నదాన సత్రంలో  భక్తులు  అన్నప్రసాదం స్వీకరించారు. దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన తెలిపారు.

About Author